చిలకలూరిపేట: ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన సంద్భంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు బిట్రా శివ నారాయణ, నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు కర్ణ సైదారావు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ జన్మదినాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారని.. ఏపీలో కూడా సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలో నిర్వహిస్తున్నారని తెలియజేసారు. నియోజకవర్గంలో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు మోడీ అభిమానులు ఘనంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కరణం నాగేశ్వరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య, పన్నీరు రామారావు ఓబీసీ మోర్చా ఆదిమూలం గురుస్వామి, పట్టణ యువమోర్చా అధ్యక్షులు నందిగం రాజు, జిల్లా నాయకులు బ్రహ్మానందం, అన్నపరెడ్డి లక్ష్మణ్, అరసవల్లి వెంకటేశ్వరరావు, ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ సుబ్బారావు, నాదెండ్ల మండల ప్రెసిడెంట్ పిన్నింటి నాగేశ్వరరావు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
September 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

