గుంటూరు: నాదెండ్ల మండలం తూబాడులో ఒక వ్యక్తి 24వ తేదీన పురుగుమందు తాగి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందాడు. పూర్తి వివరాల ప్రకారం నాదెండ్ల మండలం తూబడు గ్రామానికి చెందిన కుంభ వీరాంజనేయులు(37) పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవపడి మనస్థాపం చెంది.. అదియును గాక తాను నాలుగు లక్షల రూపాయలు వ్యవసాయంలో నష్టపోయి ఉన్నందున.. ఈ రెండు కారణాలతో 24వ తేదీ వ్యవసాయం చేస్తున్న పొలంలో పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని 108 లో నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే వీరాంజనేయులు పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు.
September 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పురుగులమందు తాగిన రైతు.. చికిత్స పొందుతూ మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

