728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 14, 2020

చిలకలూరిపేటలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

చిలకలూరిపేట: నియోజకవర్గంలో గత వారం నుండి కరోనా వైరస్ విజృంభిస్తుంది. చిలకలూరిపేట పట్టణంలో 10వ తేదీన 30 కేసులు, 12వ తేదీన 12, 13వ తేదీన 8 కేసులు నమోదవుతున్నాయి. పట్టణంలో గత వారం క్రితం వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, మరలా వైరస్ విజృంభిస్తూ పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు చిలకలూరిపేట పట్టణంలో 864 కరోనా కేసులు నమోదయ్యాయి.

నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు పెరుగుదలలో రెండో స్థానంలో నాదెండ్ల ఉంది. నాదెండ్ల మండలంలో కరోనా కేసుల సంఖ్య నియోజకవర్గ పరిధిలో మొత్తం మీద రెండో స్థానం ఆక్రమించింది. నాదెండ్ల మండలం నరసరావుపేటకు దగ్గరగా ఉండటంవల్ల ఎక్కువ మంది నర్సారావుపేటకు వెళ్లి రావడం జరుగుతూ ఉంటుంది. అలానే నాదెండ్ల మండలం గణపవరం పారిశ్రామిక అభివృద్ధి చెందటం వల్ల వలస కార్మికులు ఎక్కువగా వచ్చి నివసించడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో మొట్టమొదటిగా అత్యధిక కేసులు నమోదు కావడం జరిగింది. తూబాడు, చిరుమామిళ్ల, చందవరం గణపవరం గ్రామాల్లో కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మొత్తంమీద ఇప్పటివరకు నాదెండ్ల మండలంలో సుమారు 488 కరోనా కేసులు నమోదయ్యాయి.

చిలకలూరిపేట మండలంలో ఇప్పటివరకు 292 కరోనా కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట మండలంలో గత నెల క్రితం నామమాత్రంగా కేసులు నమోదయ్యాయి. అయితే ఒక నెల నుండి కరోనా కేసులు పెరుగుతూ ఒక్క గ్రామంలోనే 10 నుండి 15 కేసులు నమోదయ్యాయి. మురికిపూడి, పసుమర్రు, కట్టుబడివారిపాలెం, వేలూరు, తదితర గ్రామాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది.

ఎడ్లపాడు మండలంలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే నియోజకవర్గం మొత్తం మీద ఈ మండలంలోనే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మండలంలోని ఎడ్లపాడులో సొలస, తిమ్మాపురం గ్రామాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది.

మొత్తంమీద చిలకలూరిపేట పట్టణం కరోనా కేసుల్లో మొదటి స్థానం ఆక్రమించగా, నాదెండ్ల మండలం రెండోస్థానంలో, చిలకలూరిపేట రూరల్ మండలం మూడో స్థానంలో, ఎడ్లపాడు మండలం నాలుగో స్థానంలో ఉన్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటి వరకు సుమారు 1858 కరోనా కేసులు నమోదైనట్లు రికార్డులను బట్టి తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కొనసాగుతున్న కరోనా విజృంభణ Rating: 5 Reviewed By: NEWS UPDATE