728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 26, 2020

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీరుపై ఈనెల 28న నిరసన

చిలకలూరిపేట: ఈనెల 28వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎదుట నవతరం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు చిలకలూరిపేటలోని కార్యాలయంలో జరిగిన విలఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన 89 రాజకీయ పార్టీల నుండి ఒక్కపార్టీని కూడా పిలవకపోవడం శోచనీయమన్నారు. ఆయనకు ఇష్టమున్న పార్టీలను మాత్రమే పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అక్టోబర్ 28న జరిగే సమావేశానికి ప్రజాస్వామ్యయుతంగా పిలవాల్సివుండగా ఇష్టానుసారంగా కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ పిలవకపోవడంను నిరసిస్తూ రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలతో కలసి నిరసన తెలుపుతామని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వానికి, గవర్నర్ కు, హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీరుపై ఈనెల 28న నిరసన Rating: 5 Reviewed By: NEWS UPDATE