గుంటూరు: ఈరోజు ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో జరిగిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే విడదల రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రపంచంలో చదువుకు ఉన్న ప్రాముఖ్యత ఇక దేనికీ లేదు. మన బిడ్డ బాగుపడాలన్నా, మన కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, కోట్ల రూపాయలు సంపాదించాలన్నా మంచి చదువులు మన బిడ్డలకు అందాలి. అప్పుడే ఒక కుటుంబం నిజమైన అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 42.34 లక్షల మంది విద్యార్థులకు సుమారు రూ.650 కోట్ల విలువైన స్టడీ కిట్లను అందించడమంటే అది ఒక్క మన వైఎస్ జగనన్న ప్రభుత్వానికే చెల్లింది. నేడు మనం విద్యార్థులందరికీ విద్యాకానుక పథకంలో భాగంగా 3 జతల బట్టలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులను అందజేస్తూ దేశం మొత్తం మనవైపు తిరిగిచూసేలా చేయగలిగాం. పాఠశాలలు మొత్తాన్ని ఆధునికీకరించాలని ఏకంగా రూ.15వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందేవి కావు. యూనిఫాంలు వగైరా అయితే విద్యార్థులకు ఇవ్వనే ఇవ్వలేదు. పుస్తకాలు కూడా విద్యాసంవత్సరం సగం అయిపోయాక విద్యార్థులకు ఇచ్చేవారు. ఇప్పడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. నాణ్యమైన భోజనాన్ని, మెనూను భారీగా పెంచి మరీ విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందజేస్తున్నాం. ఇందుకోసం ఏడాదికి రూ.465 కోట్లను అదనంగా వెచ్చిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాధురి, యం.ఈ.ఓ పిల్లి డేవిడ్ రత్నం, స్కూల్ హెడ్ మాస్టర్ హాజరయ్య, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గల్లా వెంకటరావు, మండల అధ్యక్షుడు కల్లూరి బుజ్జి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యఘ్నేశ్వరరెడ్డి, గ్రామ పార్టీ నాయకులు ముక్తా వాసు, గల్లా రాధ, కాకుమాను బ్రహ్మయ్య, కాకుమాను విజయ్ కాంత్, మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
October 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: దేశం మొత్తం మన వైపు చూసేలా జగనన్న విద్యా కానుక: ఎమ్మెల్యే
Rating: 5
Reviewed By: NEWS UPDATE

