728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 4, 2020

హత్రాస్ ఘటన దోషులను వెంటనే శిక్షించాలని చిలకలూరిపేటలో ధర్నా

చిలకలూరిపేట: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత మహిళ మనీషా వాల్మీకికు జరిగిన దారుణాన్ని నిరసిస్తూ.. ఈ ఘటనకు పాల్పడిన దోషులను వెంటనే శిక్షించాలని ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులకు న్యాయం చేకూరేలా వ్యవహరించాలని కోరుతూ, సీఎం యోగి రాజీనామా చేయాలంటూ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో పట్టణంలోని కళామందిర్ సెంటర్ మసీదు ఎదురు నిరసన తెలియజేసి మానవహారంగా ఏర్పడ్డారు. మనిషా వాల్మీకికు సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఉంచారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ, మస్తాన్వలి, అబ్దుల్, మాలిక్, కరిముల్లా, సుభాని, నాగూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ, నవ తరం నాయకులు రావు సుబ్రమణ్యం, లోక్ సత్తా నాయకులు భాను ప్రసాద్, టిడిపి నాయకులు మల్లిబాబు, అజారుద్దీన్, వైఎస్ఆర్సిపి నాయకులు తలహా ఖాన్, మౌలాలి, దళిత నాయకులు నల్లపు కోటి, అడపా  మోహన్, సిపిఎం నాయకులు బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హత్రాస్ ఘటన దోషులను వెంటనే శిక్షించాలని చిలకలూరిపేటలో ధర్నా Rating: 5 Reviewed By: NEWS UPDATE