చిలకలూరిపేట: పేట మండలం లింగంగుంటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. షేక్ కరీముల్లా అనే 7 సంవత్సరాల బాలుడిని పిన్నమ్మ ఆషా మతిస్థిమితం లేక అతి దారుణంగా కత్తితో పొట్టకోసి పేగులు బయటకు తీసి అక్కడే కూర్చుంది. ఆషా వారి అక్క నరసరావుపేట నుండి వచ్చి వారి ఇంట్లో ఉన్నారు. అయితే ఆషా వాళ్ళ భర్త వాళ్ళ అక్క ఈ రోజు చీరాలకు వెళ్లడంతో మతిస్థిమితం లేని ఆషా అక్క కొడుకుని అతి దారుణంగా కత్తితో పొట్ట కోసి పేగులు తీసింది. ఈ దారుణ సంఘటన చోటు చేసుకోవడంతో మృతిచెందిన కరిముల్లా చెల్లెలు మరి ఇద్దరు పిల్లలు తలుపు వేసుకొని గడియ పెట్టుకున్నారు. ఈ సంఘటన తెలిసిన రూరల్ సీఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై భాస్కర్ ఆధ్వర్యంలో తలుపు తీసి ఆ పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ సుబ్బారావు మీడియాకు తెలియజేశారు.
October 4, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో దారుణం.. బాలుడి పొట్ట, గొంతు కోసి చంపిన మహిళ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

