చిలకలూరిపేట: పట్టణంలో నేడు 3 కరోనా కేసులు నమోదయ్యాయి. సిఆర్ కాలనీలోని ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలో గత పది రోజుల నుండి మరల కేసులు పెరుగుతున్నాయి. గత నెల 25వ తేదీ నుండి రోజుకు 10 కేసులు తగ్గకుండా 15, 20 వరకు నమోదవుతున్నాయి. నిన్న శనివారం 15 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణంలో 1000 దాటి ఆ సంఖ్య నేటికీ సుమారు 1,088గా నమోదయింది. ఇప్పటివరకు పట్టణంలో కరోనా తో 23 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
October 4, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

