చిలకలూరిపేట: పట్టణంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు నివారించాలని లోక్ సత్తా నాయకులు భానుప్రసాద్ కోరారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, ఈ విషయం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వారు వివరించారు. శనివారం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద, అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఇరువురు వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారన్నారు. జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి అధికారులు చర్యలు చేపట్టాలని భానుప్రసాద్ కోరారు.
October 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 'రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి'
Rating: 5
Reviewed By: NEWS UPDATE
