చిలకలూరిపేట: దేశం గర్వపడే విధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరిలో చిలకలూరిపేట ప్రాంతం నుంచి 235, 1051, 1164, 2182 ఈడబ్ల్యూఎస్ కోటాలో 12, 92, 185, 482 ర్యాంకులు సాధించిన విద్యార్థులు యశస్వీ, భానుతేజ, వెంకట్, లక్ష్మీ ప్రవల్లిక, చంద్రమౌళి, మౌనికలను చిలకలూరిపేటలోని తన నివాస గృహంలో గురువారం అభినందించారు. ప్రతి విద్యార్థిని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్న సత్య నాదెళ్ల, సుందర్ పిచై లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల కష్టాలను గుర్తుంచుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు తెదేపా నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, ఎస్ సుభాని, తూబాటి శ్రీహరి, ముద్దన నాగేశ్వరరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
October 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: మాజీమంత్రి ప్రత్తిపాటి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

