అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 67,419 మందికి పరీక్షలు నిర్వహించగా 2,997 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 3,585 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 7,69,576 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 21 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 6,587 కు చేరింది.
October 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

