728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 7, 2020

ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్‌: WHO

జెనీవా:
★ కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

★ ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 

★ ఆ దిశగా ఆశలు రేకెత్తుతున్నాయన్నారు. 

★ యావత్తు ప్రపంచం వ్యాక్సిన్‌ కోసం వేచిచూస్తోందని తెలిపారు. 

★ ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

★ ఆ దిశగా దేశాధినేతల హామీ ఈ తరుణంలో అత్యవసరమని అభిప్రాయపడ్డారు. 

★ వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం ప్రపంచ దేశాలు కోవాక్స్‌ పేరిట కూటమి కట్టిన విషయం తెలిసిందే. 

★ ప్రస్తుతం ఈ కూటమి ఆధ్వర్యంలో తొమ్మిది వ్యాక్సిన్లు అభివృద్ధిలో దశలో ఉన్నాయి. 

★ వీటిలో ముఖ్యంగా ఫైజర్‌ కంపెనీ తయారు చేస్తున్న టీకాపైనే అందరి ఆశలు ఉన్నాయి.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్‌: WHO Rating: 5 Reviewed By: NEWS UPDATE