చిలకలూరిపేట: ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అసిస్ట్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని 30 మంది వినికిడి సమస్య ఉన్న పిల్లలకు హియరింగ్ ఎయిడ్స్ మెషీన్ లను అందజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 30 మంది పిల్లలను గుర్తించి వారికి స్పీచ్ తెరఫీ, ఫిజియోథెరఫీ చేపించిన అనంతరం ఒక్కొక్కరికి 30 వేల రూపాయల విలువ చేసే మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా చిలకలూరిపేట కళాశాలల అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు, డాక్టర్ వెంకటేశ్వరరావు, అసిస్ట్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్ పాల్గొన్నారు. 30 మంది పిల్లలకు ఉచితంగా మందులు, మిషన్లు అందజేశారు. ఈ సంస్థ ద్వారా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేసినట్లు ముఖ్య అతిధి తేళ్ల సుబ్బారావు తెలిపారు.
November 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అసిస్ట్ ఆధ్వర్యంలో రూ.10 లక్షలు విలువైన హియరింగ్ మిషన్‌లు అందజేత
Rating: 5
Reviewed By: NEWS UPDATE
