చిలకలూరిపేట: మీ ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ కాలేదా... అయితే కొన్ని పథకాలకు డబ్బులు తీసుకోవాలంటే ఆలస్యం అవుతుంది. బ్యాంకుకు వెళ్ళకుండా ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింక్ అయితే బయట ఆన్లైన్ సెంటర్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మీ ఆధార్ కార్డు పోయినా తీసుకోవచ్చు. అందుకోసం మీ ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింక్ అప్ చేసుకోండి. కేవలం 250 రూపాయలు మాత్రమే. ఆలసించిన ఆశాభంగం... ఈ అవకాశం మళ్ళీ రాదు... మీకోసమే... చిలకలూరిపేట వచ్చాను... రండి రండి 250 రూపాయలు ఇస్తే మీ ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ అప్ చేస్తాను నంటూ గణపవరంకు చెందిన ఒక వ్యక్తి చిలకలూరిపేట పట్టణంలోని తూర్పు మాలపల్లె, గుర్రాలచావిడి ప్రాంతాల్లో ఈరోజు ఒక్కొక్కరి వద్ద నుండి 250 రూపాయలు తీసుకొని ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అప్ చేస్తున్నాడు. ప్రభుత్వం కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు కొన్ని ఆన్లైన్ సేవలను ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అప్ చేయటానికి అనుమతి ఇవ్వడంవల్ల ఈ ఒక్క అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యక్తులు పేద ప్రజల దగ్గర అధిక డబ్బు వసూలు చేయడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట లోని అధికారులు మీడియా ద్వారా తెలుసుకొని అతనిని మందలించి పంపు వేసినట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ 20 రూపాయలు తీసుకొని చేసే ఆధార్ లింక్ ₹250 తీసుకోవడంపై స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
చిలకలూరిపేట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ అప్ చేస్తే 250 రూపాయలు మాత్రమే