728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 7, 2020

యడ్లపాడులో విద్యుత్ శాఖ అధికారుల దాడులు

యడ్లపాడు: మండలంలోని గ్రామలలో విద్యుత్ శాఖ విజిలెన్స్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, K.V.L.N. మూర్తి, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, టౌన్ 2, గుంటూరు, J. శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు విద్యుత్ సిబ్బందితో 32 బ్యాచ్ లుగా దాడులు నిర్వహించి 2619 సర్వీస్ లను తనిఖీ చేయగా అనధికార విద్యుత్ వినియోగం కింద 97 కేసులు నమోదు చేసి రూ.4,50,000/- అపరాధ రుసుం వేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పై అధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అనధికార విద్యుత్ వినియోగం చేస్తున్నవారిపై మున్ముందు విద్యుత్ సిబ్బంది గ్రూప్ లుగా  దాడులు నిర్వహిస్తామని కేసులు నమోదు చేసి భారీగా అపరాధ రుసుం విధిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడులలో చిలకలూరిపేట డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ సి.హెచ్. రాంభోట్లు, యడ్లపాడు అసిస్టెంట్ ఇంజనీర్ డి. పుల్లారెడ్డి మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: యడ్లపాడులో విద్యుత్ శాఖ అధికారుల దాడులు Rating: 5 Reviewed By: NEWS UPDATE