చిలకలూరిపేట: ప్రజలకు సుపరిపాలనను అందించే విషయంలో దేశంలోనే గొప్ప సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. ప్రజల్లో నాడు.. ప్రజలతో నేడు.. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విడదల రజిని చేస్తున్న పాదయాత్ర శుక్రవారం 8వ రోజుకు చేరింది. చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు రోడ్డు నుంచి మొదలైన పాదయాత్ర మానుకొండవారిపాలెం గ్రామం మీదుగా చిలకలూరిపేట పట్టణానికి చేరుకుంది. ఇప్పటివరకు 8 రోజులకు కలిపి మొత్తం మీద 43 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో మొదలైన పాదయాత్ర మండలంలోని పలు గ్రామాల మీదుగా నాదెండ్ల, చిలకలూరిపేట రూరల్ మండలాల్లోని పలు గ్రామాల మీదుగా చిలకలూరిపేట పట్టణానికి చేరుకుంది. ఈ నెల 16వ తేదీ వరకు చిలకలూరిపేటలో పాదయాత్ర కొనసాగనుంది.
దారిపొడవునా జననీరాజనం
పాదయాత్ర దారి పొడవునా ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చిలకలూరిపేట పట్టణం, రూరల్ మండలాల నుంచి భారీగా తరలివచ్చారు. మానుకొండవారిపాలెం గ్రామ శివారు పోలేరమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం పాదయాత్ర మొదలైంది. వైఎస్సార్ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించారు. గ్రామంలోని పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ మహిళా సాధికారత విషయంలో ఏపీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. మహిళలకు ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో సీఎం జగనన్న చరిత్రలో నిలిచిపోతారని వెల్లడించారు. ఇళ్ల పట్టాల దగ్గరి నుంచి రేషన్ కార్డుల వరకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి లబ్ధి ఆడపడుచులకే దక్కేలా చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పారు. ఇంత గొప్ప ప్రభుత్వానికి మహిళలంతా అండగా నిలవాలని తెలిపారు.
పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు
పాదయాత్ర శుక్రవారం పట్టణానికి చేరింది. చిలకలూరిపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నాయకులు బషీర్ మేస్త్రి తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహంచారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యఘ్నేశ్వర రెడ్డి,రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అల్లిమియా, రాష్ట్ర ముస్లిం సంచార జాతుల డైరెక్టర్ షేక్ దరియా వలి,రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండెబోయిన అనూష,చిలకలూరిపేట మండల అధ్యక్షుడు దేవినేని శంకరరావు,చిలకలూరిపేట జడ్పీటీసీ అభ్యర్థి కోడె సుధారాణి, నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి,నాదెండ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎడ్లపాడు మండల అధ్యక్షుడు కల్లూరి బుజ్జి,ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు,చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,చిలకలూరిపేట మునిసిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి కొలిశెట్టి శ్రీనివాసరావు,పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,పట్టణ ముస్లిం, మైనారిటీ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరంజినేయులు,మానుకొండవారిపాలెం నాయకులు కల్లి వెంకటరెడ్డి,కల్లి శ్రీనివాసరెడ్డి,బైకా వెంకటరెడ్డి,మొవ్వ అంజిరెడ్డి,కల్లి కోటిరెడ్డి,మానుకొండ రత్నారెడ్డి,మానుకొండ వెంకటరెడ్డి,మానుకొండ చంద్రశేఖర్ రెడ్డి,తియ్యగూర రవీంద్ర రెడ్డి,మానుకొండ సాంబిరెడ్డి,మానుకొండ విష్ణు చైతన్య రెడ్డి మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

