728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 12, 2020

జనం మద్దతు జగనన్నకే: ఎమ్మెల్యే

చిలకలూరిపేట: పాద‌ యాత్రలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న జ‌గ‌న‌న్న అద్భుత‌పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా ఉంద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. జ‌న‌మంద‌రి మ‌ద్ద‌తు జ‌గ‌న‌న్న‌కే అని చెప్పారు. ప్ర‌జ‌ల్లో నాడు.. ప్ర‌జ‌ల కోసం నేడు.. కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో చేస్తున్న పాద‌యాత్ర గురువారం ఏడో రోజుకు చేరింది. య‌డ్ల‌పాడు మండ‌లం ఉన్న‌వ గ్రామంలో ప్రారంభ‌మైన పాద‌యాత్ర య‌డ్ల‌పాడు మండ‌లంతోపాటు నాదెండ్ల మండ‌లంలోని ప‌లు గ్రామాల మీదుగా కొన‌సాగి గురువారం నాటికి చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం వేలూరు గ్రామానికి చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 40 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర కొన‌సాగింది. గురువారం ఒక్క రోజే గ‌ణ‌ప‌వ‌రం రోడ్డు నుంచి వేలూరు గ్రామంలోకి మొత్తం మీద 4 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని గంగ‌మ్మ త‌ల్లి, బొడ్డురాయి, శివాల‌యాల్లో పూజ‌లు చేశారు. ద‌ర్గా వ‌ద్ద కొబ్బ‌రికాయ‌లు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం రామాల‌యం వ‌ద్ద అరుగుపై ఎమ్మెల్యే ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.


స‌చివాల‌యాల ద్వారా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల క‌మిటీ అంగీక‌రిస్తేనే సంక్షేమ ప‌థ‌కాలు ద‌క్కేవ‌ని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని చెప్పారు. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ప‌థ‌కాలు అంద‌రికీ అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు ప‌రిపాల‌న‌లో ఎవ‌రి ప్ర‌మేయం లేద‌ని చెప్పారు. నేరుగా స‌చివాల‌యాల ద్వారా అర్హులంద‌రూ ఆయా ప‌థ‌కాల ఫ‌లాల‌ను పొందొచ్చ‌ని తెలిపారు. టీడీపీ హయాంలోలాగా ఎలాంటి చెత్త క‌మిటీలు గ్రామాల్లో పెత్త‌నం చేసే అవ‌కాశ‌మే ఇప్పుడు లేద‌ని చెప్పారు. కులం, మ‌తం, పార్టీ వివ‌క్ష లేకుండా అర్హులంద‌రికీ న్యాయం చేసేలా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని చెప్పారు. ప్ర‌భుత్వాన్ని, పాల‌న‌ను గ్రామ‌స్థాయిలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో జ‌గ‌న‌న్న ఒక విప్ల‌వాన్ని తీసుకొచ్చార‌ని తెలిపారు.
*భారీగా త‌ర‌లివ‌చ్చిన మ‌హిళ‌లు*
చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లంలో మొద‌టి రోజు పాద‌యాత్ర‌కు మ‌హిళ‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు. మండ‌లంలోని ఆయా గ్రామాల నుంచి త‌ర‌లివ‌చ్చి వారి వారి స‌మ‌స్య‌ల‌ను ర‌చ్చ‌బండ‌లో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్ర‌జ‌ల నుంచి ఎక్కువ‌గా డ్రెయిన్లు, సీసీ రోడ్ల స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ఆయా స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా గ్రామంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. డీజే, తీన్‌మార్ సంద‌డి చేశాయి. ఎమ్మెల్యేపై పూల‌వ‌ర్షం కురిసింది. పాద‌యాత్ర పూర్త‌య్యే వ‌ర‌కు వంద‌లాది మంది మ‌హిళ‌లు ఎమ్మెల్యే వెంటే ఉండి న‌డిచారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యఘ్నేశ్వర రెడ్డి,రాష్ట్ర ముస్లిం సంచార జాతుల డైరెక్టర్ షేక్ దరియా వలి,రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండెబోయిన అనూష,చిలకలూరిపేట మండల అధ్యక్షుడు దేవినేని శంకరరావు,చిలకలూరిపేట జడ్పీటీసీ అభ్యర్థి కోడె సుధారాణి, నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి,నాదెండ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎడ్లపాడు మండల అధ్యక్షుడు కల్లూరి బుజ్జి,ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు,చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,చిలకలూరిపేట మునిసిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి కొలిశెట్టి శ్రీనివాసరావు,పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,పట్టణ ముస్లిం, మైనారిటీ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,వేలూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు పఠాన్ దౌలత్ ఖాన్,గ్రామ పార్టీ నాయకులు గేరా ముసలయ్య,బొంత నాగభూషణం,తుమ్మలగుంట రమేష్,కృష్టావరపు శేఖర్,మాజీ ఎంపీటీసీ బొంత సుబ్బారావు,గొట్టిపాటి సుబ్బారావు, బొంత భాగ్యరావు,పఠాన్ మాభు సుభాని,పఠాన్ మస్తాన్,చెల్లి అనిల్ కుమార్,గేరా రాజేష్,బొంత భీముడు,సింగం కృష్ణమోహన్,పఠాన్ మోశాబీ, పమిడి మనోహర్,ఊట్ల లెనిన్ బాబు,మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జనం మద్దతు జగనన్నకే: ఎమ్మెల్యే Rating: 5 Reviewed By: NEWS UPDATE