గుంటూరు: ప్రజలలో నాడు... ప్రజలతో నేడు.. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రజిని 2వ రోజు పాదయాత్ర ఆద్యంతం జనసందోహంతో సాగింది. మొదటిరోజు ఆగిన గ్రామం బోయపాలెం నుంచి వంకాయలపాడు మీదుగా యడ్లపాడు వరకు పాదయాత్ర కొనసాగింది. యడ్లపాడు లూథరన్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మహిళా సదస్సుతో రెండో రోజు పాదయాత్ర ముగిసింది. రెండో రోజు మొత్తం 9.5 కిలోమీటర్ల దూరం ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు. మహిళా సదస్సులో ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ... పాదయాత్రలో తాను ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుందామని ప్రయత్నిస్తుంటే.. మీకు చెప్పుకోవడానికి తమ వద్ద ఏ సమస్యలు లేవని అంటున్నారని, ప్రతి సమస్యను వాలంటీర్లే ఇళ్ల వద్దకు వచ్చి పరిష్కరిస్తున్నారంటూ... తనకు జవాబులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇంత గొప్ప పాలన దేశంలో ఎక్కడా కనిపించదని చెప్పారు. పేదపిల్లలను తల్లులు ఆనందంగా చదివించుకునేందుకు వీలుగా అమ్మ ఒడి, పేదింటి బిడ్డ ఉన్నత చదువులు సజావుగా సాగేందుకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, లక్షలకు లక్షలు ఆస్పత్రులకు ఖర్చు కాకుండా ఉండేలా, ప్రజలకు మేలు చేకూరేలా ఆరోగ్యశ్రీ పథకం.. ఇలా పథకాలన్నీ ప్రజల బతుకుకు ఒక భరోసా ఇచ్చేవేనని చెప్పారు.ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న మహిళలు.
November 7, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఇంత గొప్ప పాలన దేశంలో ఎక్కడా ఉండదు: ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

