728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 21, 2021

చిలకలూరిపేట:ఆధార్ పేరిట 100 నుండి 150 వసూలు చేస్తున్న మెప్మా అధికారులు..!?


చిలకలూరిపేట: ప్రతి మహిళ తన సొంత కాళ్ళ మీద నిలబడాలని ప్రభుత్వం ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు పొంది తమ కుటుంబాన్ని పోషించుకునే దిశగా అభివృద్ధి చెందాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేసింది. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో సుమారు 2 వేలసెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు ఉన్నాయి. అయితే వీరు ఆయా గ్రూపుల ద్వారా బ్యాంకు రుణాలు పొందాలంటే తప్పనిసరిగా ఆ మహిళ యొక్క ఆధార్ అప్డేషన్ అయ్యి ఉండాల్సిందే. ఈ కేవైసీ అయ్యుంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆప్డేషన్ అయి ఉంటుంది. కానీ చిలకలూరిపేట పరిధిలో సుమారు 1500 మంది సభ్యులు ఈ కేవైసీ నమోదుకాక ఆధార్ అప్డేషన్ జరగలేదు. ఆధార్ అప్డేషన్ జరగక పోవడం వల్ల మీకు రుణాలు రావని, వైస్సార్ ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, ప్రభుత్వ పథకాలు రావని చిలకలూరిపేట లో పనిచేస్తున్న మెప్మా అధికారులు చెప్పడంతో చేసేది లేక మహిళలు మెప్మా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 

అయితే చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని కార్యాలయం లో ఉన్న మెప్మా అధికారులు మాత్రం ఆధార్ అప్డేట్ చేయడానికి 100 రూపాయల నుండి 150 రూపాయలు ఇవ్వాల్సిందేనని ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ముక్కు పిండి మరీ రెండు రోజుల నుండి ఇప్పటికి 200 మంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఆధార్ అప్డేట్ చేయడానికి గణపవరం చెందిన ఒక మీసేవ వ్యక్తి 150 రూపాయలు తీసుకుంటున్నారని వారికి డబ్బు ఇవ్వటానికి మేము తీసుకుంటున్నామని సదరు అధికారి తెలిపారు. అదేమంటే అతి తక్కువ 50 రూపాయలకు మీరు చేయిస్తారా..? అని కూడా ప్రశ్నించడం సదరు అధికారి వంతయింది. ఆధార్ అప్డేషన్ అధికారులు చేయాలనుకుంటే మరి మహిళ దగ్గర తంబు ఇంప్రెషన్ తీసుకోవాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీ మాత్రమే తీసుకొని లాగిన్ లోకి వెళ్లి అప్డేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం 1500 మహిళల వద్ద డబ్బు వసూలు చేయటానికి గ్రూపు మహిళలను కార్యాలయం చుట్టూ తిరిగేలా చేస్తున్నారని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గుంటూరు జిల్లా మెప్మా పి డి దాసరి బాలయ్య దృష్టికి తీసుకువెళ్లగా డబ్బు వసూలు చేసిన అధికారులపై విచారణ చేయిస్తామని తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట:ఆధార్ పేరిట 100 నుండి 150 వసూలు చేస్తున్న మెప్మా అధికారులు..!? Rating: 5 Reviewed By: NEWS UPDATE