చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను వలపన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. చిలకలూరిపేట మండలంలోని కొమతినేనివారి పాలెం లో కోటేశ్వర రావు అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్న సమాచారంతో అతనిని పట్టుకొని అతనికి ఎక్కడి నుండి గంజాయి సరఫరా అవుతుందో అతని ద్వారా ఫోన్ చేయించి మిగతా ఇంకో వ్యక్తిని కూడా పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజు పల్లి కి చెందిన మస్తాన్ రావు అనే వ్యక్తి కు కోటేశ్వరావు ద్వారా ఫోన్ చేయించి గంజాయి అయిపోయిందని తీసుకురమ్మని కోరగా అతను 25 కిలోల గంజాయి ఒక బైక్ తీసుకుని వస్తుండగా బొప్పుడి సమీపంలోని జాతీయ రహదారి వద్ద అతనిని కూడా పట్టుకొని ఇరువురిపై కేసు నమోదు చేసి 27 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వారి వద్ద బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ వేంపల్లి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయిని వీరు ఇంజనీరింగ్ విద్యార్థులకు అమ్ముతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని దాని ఆధారంగా వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయి విలువ సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు ఈ దాడుల్లో ఎక్సైజు బ్యూరో సి ఐ కర్ణ, ఎస్ ఐ ప్రసాద్ సిబ్బందిని ఎక్సైజ్ సూపర్ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు..
March 23, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 5 లక్షల రూపాయల గంజాయి పట్టుకున్న అధికారులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

