728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 21, 2021

చిలకలూరిపేట: కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలి

చిలకలూరిపేట: కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ చిలకలూరిపేట లో అత్యధికంగా కరోనా టెస్టులు చేయాలని సూచించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాల్సిందిగా వీరు కోరారు. చిలకలూరిపేటలో ఒంటి గంట నుంచి లాక్ డౌన్ అమల్లో ఉందని ఒంటి గంట తర్వాత ప్రతి ఒక్కరూ షాపులు మూసివేసేలా పోలీసులు చర్యలు చేపట్టాలని తెలిపారు. కరోనా వచ్చిన ప్రాంతాల్లో శానిటేషన్ చేయాలని వీరు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భౌతిక దూరం పాటించి, మాస్కు ధరించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐ నరస దాసు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపీనాయక్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఫణీంద్ర, రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE