చిలకలూరిపేట: పట్టణంలో చాప కింద నీరులా కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. అయితే పట్టణ పరిధిలో కరోనా టెస్టులు చేయక కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ద్వారా నిర్వహించవలసిన టెస్ట్లు గత కొద్ది రోజుల నుండి నిర్వహించకపోవడంతో ఏమి చేయాలో దిక్కు తోచక ప్రైవేటు ల్యాబ్లో కోవిడ్ టెస్ట్లు చేయించుకుంటున్నారు. ప్రైవేట్ టెస్ట్లు చేయించుకున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ చెసుకోక వారు ఇళ్లలోనే వైద్య సహాయం పొందుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రాగన్నపాలెం, ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణంలో మాత్రమే కరోనా టెస్టులు వైద్యాధికారులు నిర్వహించారు. తదనంతరం పట్టణంలో ఎక్కడా టెస్ట్లు నిర్వహించిన దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ అయితే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు నిర్వహించాల్సిందేనని ఆదేశించారు. కానీ చిలకలూరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్లు నిర్వహించటంలేదని... కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని గుర్రాల చావిడి, సుబ్బయ్య తోటలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టెస్ట్లు నిర్వహించాలని పుర ప్రజలు కోరుతున్నారు.
April 21, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కరోనా పరీక్షలు ఏవి?.. చేయి దాటుతున్న పరిస్థితి!?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

