చిలకలూరిపేట: పట్టణంలో ఇటీవల కొంతకాలంగా రాత్రిపూట ఇళ్ళ ముందు పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్ నుండి కొందరు యువకులు పెట్రోల్ దోగతనం చేస్తున్నారు.
గత నాలుగు రోజుల క్రితం పట్టణంలోని రహ్మత్ నగర్ ప్రాంతంలో నలుగురు యువకులు రెండు మోటార్ సైకిల్ పై వచ్చి, అర్ధరాత్రి సమయంలో మోటార్ సైకిల్ నుండి పెట్రోల్ దొంగతనం చేస్తుండగా స్థానికులు వారిని అటకాయించగా ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. నాలుగో వ్యక్తిని పోలీసులకు అప్ప చెప్పినారు.
గత కొంత కాలంగా మోటార్ సైకిల్ పెట్రోల్ మాయమవడం పరిపాటిగా మారిందని, అసలకే కరోనా కారణంగా పనులు ఇబ్బంది పడుతూ ఉంటే మోటార్ సైకిల్ లో పెట్రోలు దొంగతనం జరగడం బాధాకరం, సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలి..
మాదాసు భాను ప్రసాద్ అడ్వకేట్ & లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్..

