728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2021

చిలకలూరిపేట: కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలం... బిజెపి నిరసన

చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వo కోవిడ్ నియంత్రణల పట్ల పూర్తిగా విఫలమైందని రోగులకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన తెలియజేస్తూ ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం బీజేపీ కార్యాలయంలో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ అన్నం శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కరోనా వైఫల్యం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కోవిడ్ నియంత్రణ పట్ల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం పట్ల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం పేరుతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కరోనా తో మృతి చెందిన వారు వారి మృతదేహాలను ఖననం చేసే విషయంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టలేదని అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు తప్ప చిత్తశుద్ధి తోటి ప్రజల పట్ల వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. గతంలో లో కరోనా వచ్చిన సందర్భంగా మేము ఇతర దేశాల నుండి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకుంటామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రగల్భాలు పలికారని ఇది కేవలం పాటలకే పరిమితమైని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో వంశీధర్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు, ఆదిమూలం గురుస్వామి క్రియాశీల సభ్యులు,జోలపురం రాయుడు, సాల్మన్ మరియు కందుల రవి యూత్ ఏబీవీపీ రాష్ట్ర అ కమిటీ మెంబరు మురారి తదితరులు పాల్గొన్నారు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలం... బిజెపి నిరసన Rating: 5 Reviewed By: NEWS UPDATE