చిలకలూరిపేట: పట్టణంలోని RVSCVS హై స్కూల్ రోడ్డులోని ఆధార్ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పరిశీలించారు. ఫోన్ నెంబరు ఆధార్ కు లింక్ చేయడానికి రోజుకు కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఉంటే వందలాది మంది జనం ఎందుకు ఉన్నారని ఆధార్ సెంటర్ నిర్వాహకునిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉన్న సమయంలో వందలాది మంది జనం ఆధార్ సెంటర్ వద్ద ఉండటం ఏమిటి అని ప్రశ్నించారు. ఇంకోసారి జనం ఇలా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
June 4, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఆధార్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహించిన కమీషనర్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

