చిలకలూరిపేట: పట్టణంలోని ఎరువులుకోట్ల బజారు, బాబు గారి తోట, చలివెంద్రం బజార్ లో ప్రభుత్వం నిషేధించిన పాన్ పరాగ్ గుట్కా భారీ ఎత్తున ప్రకాశం జిల్లా పోలీసులు కనుగొని రెండు లారీల్లో బుధవారం రాత్రి (09-06-21) 12:20 నిమిషాలకు తీసుకువెళ్లారు. పూర్తి వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా వేటపాలెం లోని ఓ పాన్ షాప్ లో పాన్ పరాగ్ గుట్కా అమ్ముతున్న విషయమై పోలీసులు విచారణ జరపగా షాపు యజమానికి చిలకలూరిపేట లోని రామకృష్ణ అనే వ్యక్తి పాన్పరాగ్ అమ్ముతూన్నట్లు అతను పోలీసులకు తెలియజేశాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం చెందిన సిఐ రోశయ్య మరియు పోలీస్ సిబ్బంది చిలకలూరిపేట కు మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో వచ్చి రామకృష్ణకు చెందిన గోడౌన్లలో భారీ ఎత్తున సుమారు 50 లక్షల రూపాయల విలువచేసే గుట్కాను ఒక లారీ నిండా ఎక్కించి మిగతా సరుకును మరొక మినీ లారీ కి ఎక్కించి బుధవారం (09-06-21) రాత్రి 12:20 నిమిషాలకు ప్రకాశం జిల్లాలోని వారి పోలీస్ స్టేషన్కు రెండు లారీల సరుకును తరలించారు. ప్రకాశం జిల్లా పోలీసులు చిలకలూరిపేట పట్టణానికి వచ్చి ఇంత భారీ ఎత్తున 50 లక్షల రూపాయల విలువ చేసే పాన్ పరాగ్ పట్టుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ పాన్ పరాగ్ గుట్కా అమ్మే వారిపై కొరడా ఝులిపిస్తున్నా చిలకలూరిపేటలో భారీ ఎత్తున పాన్పరాగ్ గుట్కా పట్టుబడటం విశేషం...
June 9, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రెండు లారీల గుట్కా పట్టుకున్న ప్రకాశం పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE




