చిలకలూరిపేట: 2021-22 మొదటి అర్ధక సంవత్సరమున కు గాను చిలకలూరిపేట పురపాలక సంఘంనకు చెల్లించవలసిన ఆస్తిపన్నుపై 30-06-2021 వరకు వడ్డీలేదు. కావున, పన్ను చెల్లింపుదారులు దగ్గరలోని వార్డు సచివాలయము నందు గానీ, మున్సిపల్ ఆఫీసు నందుగానీ, ఆన్ లైను ద్వారా గానీ డిమాండ్ నోటీసు లేదా గతంలో చెల్లించిన ఆస్తి పన్ను తాలూకు రశీదు చూపించి 30-06-2021 లోగా ఆస్తిపన్ను (భవనముల మరియు ఖాళీస్థలముల పన్ను) పూర్తిగా చెల్లించి ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొనవలసినదిగా కోరడమైనది. అట్లు చెల్లించని యెడల తేది 01-07-2021 నుండి 2 శాతం వడ్డీతో చెల్లించవలసియుండునని తెలియజేయడమైనది.
-- మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, చిలకలూరిపేట పురపాలక సంఘం.

