చిలకలూరిపేట: పఠాన్ చిన సత్తార్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రైవేటు టీచర్లకు కరోనా వల్ల జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్న 40 మంది టీచర్లకు లక్ష రూపాయలు పఠాన్ చిన సత్తార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పఠాన్ యూసుఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చేతులమీదుగా టీచర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అనేక రంగాల్లో చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని కరోనా కష్టకాలంలో టీచర్లను ఆదుకోమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి తాను స్వయంగా అడిగి వినతిపత్రం అందజేశానని అన్నారు. లాక్ డౌన్ క్లిష్ట సమయంలో చిన సత్తార్ ట్రస్ట్ సేవలు చేస్తున్నట్లు తెలిసి టీచర్లు యూసుఫ్ ఖాన్ ను అడిగిన వెంటనే వారికి లక్ష రూపాయలు నగదు రూపంలో అందచేయడం వల్ల ఎంతో కొంత మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు. పఠాన్ యూసుఫ్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించామని... మానవత్వంతో టీచర్లకు కొంత ఆర్థిక సహాయం చేసామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల రామకృష్ణ, సి.ఆర్ కళాశాలల అధ్యాపకులు కోటేశ్వరరావు, షఫీ, సురేష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
June 6, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: టీచర్లకు లక్ష రూపాయలు అందజేసిన పఠాన్ యూసుఫ్ ఖాన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE
