728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 4, 2021

చిలకలూరిపేట టౌన్: బియ్యం వ్యాపారి దుకాణంలో భారీగా నగదు చోరీ

చిలకలూరిపేట: పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలోని బియ్యం మిల్లు కు చెందిన దుకాణంలో భారీగా నగదు చోరీ జరిగింది.  చిలకలూరిపేట అర్బన్ సిఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి సంబంధించిన వివరాల ప్రకారం చిలకలూరిపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఉన్న సాయి మణికంఠ ట్రేడర్స్ రైస్ మిల్లు యజమాని అర్వపల్లి కాశీ విశ్వేశ్వర రావుకు మిల్లు ఎదురు బియ్యం అమ్మే దుకాణం ఉంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం కు నగదు చెల్లించేందుకు శనివారం రాత్రి రూ.11.5 లక్షల నగదును సమీకరించి దుకాణంలోని బీరువాలో పెట్టాడు. ఆదివారం ఉదయం రైతులకు నగదు చెల్లించేందుకు దుకాణం తెరచి లోపల చూడగా బీరువాలో నుంచి మూడు నోట్ల కట్టలు కింద పడటం గమనించి చూడగా బీరువా పగలగొట్టి చోరీ జరగడాన్ని గుర్తించాడు. కార్యాలయం వెనుక వైపు వెంటిలేటర్ కు ఉన్న ఇనుప గ్రిల్ పగలకొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువా పగలగొట్టి అందులోని రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట టౌన్: బియ్యం వ్యాపారి దుకాణంలో భారీగా నగదు చోరీ Rating: 5 Reviewed By: NEWS UPDATE