చిలకలూరిపేట: మండల పరిధిలోని జాతీయ రహదారి PS 5 రెస్టారెంట్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బసినేపల్లి గ్రామ నివాసి పూజల నారాయణ (42) బైకుపై వస్తుండగా PS 5 రెస్టారెంట్ సమీపంలో జారి కింద పడడంతో అతనికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది శోభన్ బాబు, పైలెట్ రాములు అక్కడికి చేరుకుని ప్రాధమిక చికిత్స చేసి అతనిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
July 4, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

