728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 7, 2021

చిలకలూరిపేట: ఒక పార్టీపై మరో పార్టీ నిందారోపణలు చేసుకుంటూ అభివృద్ధి మరిచారు: బిజెపి

చిలకలూరిపేట: నియోజకవర్గంలో కనీస అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అయినా మంచినీటి వసతి మురుగు నీటి వసతిని కల్పించటంలో గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు అధికారులు ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.
 ఈరోజు చిలకలూరిపేట లో ఎక్కడ చూసినా సరైన మురుగునీరు వసతి లేదని తాగునీరు వసతి కోసం అమృత్ పథకం కింద 2017 లో కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ 139 కోట్ల రూపాయల పథకాన్ని వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో అమృత పథకాన్ని శాంక్షన్ చేశారన్నారు..అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ పథకాన్ని పూర్తి చేయకుండా తెలుగుదేశం వారు వైసిపి వారు ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటూ సమస్యను పక్కదోవ పట్టించి ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ అవసరాల గడుపుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల సొంత అభివృద్ధి అయితే జరిగింది కానీ నియోజకవర్గ అభివృద్ధి శూన్యం తెలియజేశారు. కేంద్రప్రభుత్వ అమృత పధకం పై కేంద్రానికి నివేదిక రెండు నెలల క్రితమే పంపామని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కారణంగా స్థానిక మున్సిపల్ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దిక్కు తోచక తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ పార్క్ ని సూటిగా చూపించి 30 కోట్ల రూపాయలు అప్పు కొరకు వెళ్లారని తద్వారా అమృత పథకాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారని ఆయన తెలియజేసారు. చిలకలూరిపేటలో ప్రజలకు కనీసం మంచినీటి అవసరాలు తీర్చకుండా గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని దానిపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం వారు వైసిపి వారు వేల కోట్లతో మీ అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని వారి ఆస్తులను అభివృద్ధి చేసుకున్నారని ఆయన తెలియజేశారు స్థానిక మున్సిపల్ ఆశలను ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందనీ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లనే చిలకలూరిపేట మున్సిపాలిటీ ఈ దుస్థితి పట్టిందని చివరకు మంచి నీటి కొరకు బ్యాంకులకు రుణాల కోసం వెళ్ళవలసిన పరిస్థితిని తీసుకొచ్చారని ఆయన తెలియజేసారు. అంతేకాకుండా చిలకలూరిపేట లో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయని రోడ్లన్నీ కూడా ప్రధాన వీధుల్లో పది నుంచి పదిహేను అడుగులు మాత్రమే ఉన్నాయని ఈ దుస్థితికి కారణం ఎవరో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున ఎల్లప్పుడు పోరాటం చేస్తుందని ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారుల దృష్టికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారము చేస్తామని వారు అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఒక పార్టీపై మరో పార్టీ నిందారోపణలు చేసుకుంటూ అభివృద్ధి మరిచారు: బిజెపి Rating: 5 Reviewed By: NEWS UPDATE