అమరావతి:
విద్యాశాఖలో నాడు- నేడుపై ముగిసిన సీఎం సమీక్ష
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎం నిర్ణయం
ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం
ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనుల పూర్తికి ఆదేశం
ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ
పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు: సురేశ్
ప్రభుత్వం నూతన విద్యావిధానం తప్పనిసరిగా అమలు చేస్తుంది: సురేశ్
నూతన విద్యావిధానం అమలుతో ఏ స్కూల్ మూతపడదు: మంత్రి సురేశ్
నూతన విద్యావిధానం అమలుతో ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదు: మంత్రి సురేశ్
రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదుల నిర్మాణం: మంత్రి సురేశ్
నాడు- నేడు కింద పనులకు రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు: మంత్రి
ఇంటర్ విద్యార్థులకు పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు: సురేశ్
ఇంటర్ విద్యార్థులకు 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు: సురేశ్
ఈనెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ: మంత్రి సురేశ్.

