728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 5, 2021

చిలకలూరిపేటలో మరలా కర్ఫ్యూ ఆంక్షలు... కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్!?


చిలకలూరిపేట: (05-07-21) పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఒకటవ తేదీ వరకు చిలకలూరిపేట పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన ఆంక్షలు అమలు ఐయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు అయ్యాయి. ఆంక్షలు సడలించిన అనంతరం  చిలకలూరిపేట పట్టణంలో గత కొద్ది రోజుల నుండి కరోనా  కేసులు పెరుగుతున్నాయి. పట్టణంలోని గుర్రాల చావిడి, జాకీర్ హుస్సేన్ వీధి, సుబ్బయ్య తోట ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కోవలో ఈరోజు 11:00 గంటలకు ఇన్సిడెంట్ కమాండర్ తాసిల్దార్ మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, అర్బన్ పోలీసులు, హెల్త్ అధికారులు టాస్క్ ఫోర్స్ సమావేశం చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా కేసులు పెరుగుతున్న గుర్రాల చావడి, జాకీర్ హుస్సేన్ వీధి, సుబ్బయ్య తోట ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలానే పట్టణంలో కర్ఫ్యూను సమయాలు ఉదయం నుండి  మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిస్తూ రెండు గంటల అనంతరం ఆంక్షలు కఠినతరం చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకొనున్నారు. ఏది ఏమైనా చిలకలూరిపేట పట్టణంలో కొన్ని ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా... కర్ఫ్యూ ఆంక్షలు సమయాలు మార్పు పై పలు నిర్ణయాలు అధికారులు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో మరలా కర్ఫ్యూ ఆంక్షలు... కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్!? Rating: 5 Reviewed By: NEWS UPDATE