728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 5, 2021

రేపటి నుండి చిలకలూరిపేటలో 2:00 వరకు మాత్రమే షాపులు: తహశీల్దార్

చిలకలూరిపేట: మండల తాసిల్దార్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జున రావు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణ మండలంలో కరోనా  కేసులు పెరుగుతున్నాయని తెలియజేశారు. అందువల్ల పట్టణ మరియు మండలంలో మంగళవారం నుండి ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపారం చేసుకోవాలని అన్నారు.  మధ్యాహ్నం రెండు గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6:00 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.  జనం ఎవరు బయట తిరగరాదని తెలిపారు. జనం బహిరంగంగా బయట తిరగవద్దు అని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర, నోడల్ అధికారి గోపీనాయక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరావు, ఎంపీడీవో హేమలత, ఎస్సై నరసదాసు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రేపటి నుండి చిలకలూరిపేటలో 2:00 వరకు మాత్రమే షాపులు: తహశీల్దార్ Rating: 5 Reviewed By: NEWS UPDATE