728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 25, 2021

చిలకలూరిపేట: పెరిగిన పెట్రో,డీజిల్ ధ‌ర‌ల‌తో సామాన్యుల బ‌తుకులు భారం


 చిల‌క‌లూరిపేట‌: పెరిగిన పెట్రో, డీజిల్ , వంట గ్యాసు ధ‌ర‌ల‌తో సామాన్యుల బ‌తుకులు దుర్బ‌రంగా మారాయ‌ని  ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు పేలూరి రామారావు, దాస‌రి వ‌ర‌హాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏఐటీయూసీ, ఆటో వ‌ర్క‌ర్స్ యూనియ‌న్  నాయ‌కుల‌తో క‌ల‌సి పెరిగిన పెట్రో, డీజిల్ ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా న‌ర‌స‌రావుపేట సెంట‌ర్‌లో సోమ‌వారం నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ పెరిగిన పెట్రోలు, డీజిల్, వంట‌గ్యాసు ధ‌ర‌ల ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డుతుంద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే నిత్యావ‌స‌ర ధ‌ర‌లు అకాసాన్ని అంటుతున్నాయ‌ని, కూర‌గాయ‌లు ధ‌ర‌లు పెరిగిపోయాయాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే జీవ‌నోపాధి కోసం ఆటోలు న‌డుపుకొని జీవిస్తున్న ఆటోడ్రైవ‌ర్లు, లారీ డ్రైవ‌ర్లు రోడ్డున ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకంటే దేశ వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని  హెచ్చ‌రించారు.మొన్నటి దాకా కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు.. టిఫిన్‌ సెంటర్లు, మిర్చి బం డీలతో జీవనం సాగిస్తున్న వారు వంట గ్యాస్‌ ధరల పెరుగదల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నార‌ని, . చిరుద్యోగాలు, షాపుల్లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు కూడా పెరిగిన పెట్రో లు ధరల కారణంగా మానసికాందోళనకు గురవుతున్నార‌ని వివ‌రించారు. . వాహ నం బయటకు తీయనిదే పనులు జరగని నేటి రోజుల్లో ప్రభుత్వాలు సుంకాల పేరుతో అధిక భారం మోపుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్య‌క్ర‌మంలో ఆటో వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కులు డి లింగారావు, రాజేష్‌, విక్ర‌మ్‌, ర‌సూల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పెరిగిన పెట్రో,డీజిల్ ధ‌ర‌ల‌తో సామాన్యుల బ‌తుకులు భారం Rating: 5 Reviewed By: NEWS UPDATE