ఎడ్లపాడు మండలం సంగం గోపాలవారి పాలెం గ్రామంలో CH. దుర్గ భవాని ప్రసవ నొప్పులతో బాధ పడుతుంది. ఎడ్లపాడు 108 అంబులెన్స్ కు సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను పరీక్షించి గుంటూరు జిజిహెచ్ కు తీసుకు వెళుతుండగా గుంటూరు మిర్చి యార్డు సమీపంలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ ను పక్కకు ఆపి సిబ్బంది ఈ ఎం టి పీ.సాయినాథ్ పైలట్ జీ.రాము ఆమెకు ప్రసవం చేయడం జరిగింది. ఆమెకి ఇదిమొదటి కాన్పు మగ బిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. వీరిని గుంటూరు జిజిహెచ్ లో అడ్మిట్ చేయడం జరిగింది. మొదటి కాన్పు అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేసినందుకు సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.. విషయం తెలుసుకున్న గుంటూరు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ బి కోటేశ్వరరావు మరియు జిల్లా మేనేజర్ సత్యనారాయణ సిబ్బందిని అభినందించారు
December 2, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అంబులెన్స్ లో ప్రసవం చేసిన 108 సిబ్బంది
Rating: 5
Reviewed By: NEWS UPDATE
