నాదెండ్ల మండలం లోని సంక్రాంత్రి పాడు గ్రామంలో నెల రోజుల వయసు ఉన్న బాబు నీటి తొట్టెలో శవమై కనిపించాడు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ రావు, చిలకలూరి పేట రూరల్ సిఐ సుబ్బారావు, నాదెండ్ల ఎస్సై సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సంక్రాంతి పాడు గ్రామానికి చెందిన పోతురాజు శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు పోతురాజు గోపికృష్ణ. గోపి కృష్ణ ఝాన్సీ రాణి అనే యువతిని ఈ ఏడాది మే 6వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఝాన్సీరాణి గర్భవతి కావడంతో గత నెల నవంబర్ 1వ తేదీన ఆమె బాబుకు జన్మనిచ్చింది. గోపికృష్ణ మంగళగిరిలోని సెల్ ఫోన్ దుకాణం లో పనిచేస్తుంటాడు. ఝాన్సీరాణి బాబుతో పాటు గోపికృష్ణ తల్లిదండ్రులు శ్రీనివాసరావు లక్ష్మీ లతో కలిసి నివాసముంటోంది. గోపికృష్ణ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుంటాడు. బుధవారం రాత్రి యధావిధిగా శ్రీనివాసరావు, లక్ష్మి , వారి కోడలు ఝాన్సీ రాణి ఆమె బాబు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 1:00 సమయంలో నెల రోజుల వ్యవధి ఉన్న బాబు నీటి తొట్టెలో విగతజీవిగా కనిపించాడు. బాబు ని నీటి తొట్టెలో ఎవరు పడేశారు అనే విషయం తెలియలేదు. విషయం తెలుసుకున్న తండ్రి గోపికృష్ణ ఇంటికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
చిలకలూరిపేట: నీటి తొట్టిలో శవమై తేలిన నెల చిన్నారి..దర్యాప్తు చేస్తున్న పోలీసులు