728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 8, 2022

చిలకలూరిపేట: కంపెనీలో పనిచేసే 11 మందికి కరోనా... మళ్లీ చిలకలూరిపేటలో విస్తరిస్తున్న కరోనా


చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని గణపవరం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక కంపెనీలో ఆఫీసులో పనిచేసే తొమ్మిది మంది సిబ్బందికి కరోనా వచ్చినట్లు తెలుస్తుంది.  ఆ కంపెనీలో పనిచేసే మేనేజర్ కుటుంబం ద్వారా మేనేజర్ కు అతని ద్వారా  సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్య అధికారుల విచారణలో తేలింది. ఇరువురితో పాటు   ఆ కంపెనీలో తొమ్మిది మందికి ఒకేసారి కరోనా నిర్ధారణ కావడంతో వారి వారి కుటుంబ సభ్యులు సైతం కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.  ప్రాథమిక  వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గోపి నాయక్  ఆ కంపెనీకి వెళ్లి ఆ విభాగాన్ని మూసివేయించి నట్లు తెలుస్తుంది.  గత రెండు రోజుల నుండి చిలకలూరిపేట లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  శుక్రవారం ఆరు కేసులు నమోదు కాగా... శనివారం ఒక్కరోజే 11 మందికి కరోనా రావడంతో చిలకలూరిపేట ప్రాంతములో కరోనా  విస్తరించనున్నట్లు తెలుస్తోంది...

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కంపెనీలో పనిచేసే 11 మందికి కరోనా... మళ్లీ చిలకలూరిపేటలో విస్తరిస్తున్న కరోనా Rating: 5 Reviewed By: NEWS UPDATE