చిలకలూరిపేట: ఐక్యపోరాటాలతోనే మున్సిపల్ కార్మికల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి బందెల రవి పిలుపు నిచ్చారు. శనివారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చిలకలూరిపేట ఏరియా శాఖ 8వ మహసభను నిర్వహించారు. ముందుగా ఏఐటీయూసీ పతాకాన్ని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏఐటీయూసీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్ వారియర్లనే పేరుతో మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటూ ప్రభుత్వాలు వారి కష్టాలను తీర్చి ఆదుకోవడంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో వున్నప్పుడు... తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి తీరుతామని హామీ ఇచ్చారని, ఉద్యోగాల పర్మినెంటు విషయమై ఇంతరవకు ఉలుకూ పలుకూ లేదని ఆరోపించారు. కనీస వేతనం రూ. 24వేలు అందించటంలేదని, కార్మికులకు అందాల్సిన యూనిఫాం, కొబ్బరినూనే తదితర వాటిని కూడా అందించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంట్రాక్ట్ మరియు బెట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, దుమ్ము, ధూళి, దుర్గంధంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యాల పాలవడం వలన మెడికల్ ఇన్వాల్ఫేషన్ జి.ఓ. లను సవరించి సరళీకరణ చేసి కార్మికుల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి ప్రజలందరినీ భయకంపితులను చేస్తున్నప్పటికీ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని, ఇదే క్రమంలో రాష్ట్రంలో 134 మంది కార్మికులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 సం॥లు నిండిన ఔట్సోర్సింగ్ కార్మికులకు గ్రాట్యూటీ, పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సందర్బంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చిలకలూరిపేట శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులుగా కొమరిగిరి చెంచయ్య, యోగయ్యలతో పాటు పలువురిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్ష,కార్యదర్శులు పేలూరి రామారావు, దాసరి వరహాలు, రైతు సంఘం ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు చెరుకుపల్లి నరసింహభారతి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట:మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి