యడ్లపాడు: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఘాట్ రోడ్డు కి వెళ్లే మార్గంలో ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి పూల తోటలోకి దూసుకెళ్లిన ఘటన శనివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల మంటి శివ కుమారి (42) తమ సమీప బంధువుల కనకాంబరం పూల తోటలో కూలి పనులకు వెళ్ళింది. పూలు కోస్తున్న సమయంలో కొండవీడు అప్రోచ్ రోడ్డు మార్గాన వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. అక్కడే పూలు కోస్తున్న శివ కుమారి కి గాయాలు కావడంతో స్థానికులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళగిరి గ్రామానికి చెందిన వైద్య విద్యార్థులు కార్ లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
January 8, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు... పూల తోటలో పనిచేస్తున్న మహిళ మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE
