చిలకలూరిపేట: అమరవీరుల ఆశయాల సాధనకు అందరూ కృషిచేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పిలుపు నిచ్చారు. మండలంలోని వేలూరు గ్రామంలో బొంతా దానియేలు 45వ వర్దంతి, బొంతా మస్తాన్ 33 వ వర్ధంతిని బుధవారం రాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ వేలూరు గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించిన అజయ్‌కుమార్ మాట్లాడుతూ పేదల రాజ్యం కోసం కమ్యూనిజం ఒక శాశ్వత సత్యం అని నమ్మి తమ ప్రాణాలను దారపోశారని ఆ అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఐక్య ఉద్యమాల ద్వారానే అమరుల ఆకాంక్షలను సాధిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని, విద్యుత్ సంస్కరణల పేరుతో సబ్సిడీ ఎత్తివేసే చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుందని, దళితుల రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టాలు వివిధ రూపాల్లో నీరుగారుతుందని, మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాయటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ, ఏరియా మహిళ సమాఖ్య కార్యదర్శి చేరుకుపల్లి నిర్మల, సీపీఐ గ్రామ కార్యదర్శి కండిమళ్ల వెంకటేశ్వర్లు,రైతు సంఘం కార్యదర్శి తాళ్లూరి బాబురావు,వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సౌటుపల్లి నాగేశ్వరరావు,గ్రామ సర్పంచ్ బొంత తిరపతయ్య,ఎంపీటీసీ బొంతా జ్యోతి, మాజీ ఎంపీటీసీ బొంతా సుబ్బారావు, కొండ్రగుంట వెంకట్రావు,సురభి రాజు,గ్రామ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కేంద్రం