728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 12, 2022

చిలకలూరిపేట: గ్రామ స్థాయి నుంచే ఉద్యమాలు చేపట్టాలి

 

చిల‌క‌లూరిపేట‌: 

ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి  కృషి చేయాల‌ని సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి జంగాల అజ‌య్‌కుమార్ కోరారు. 

భారత కమ్యూనిస్టు పార్టీ వేలూరు గ్రామ శాఖ కమిటీ సమావేశం బొంత ధనరాజ్ అధ్యక్షతన గురువారం రాత్రి  జరిగింది ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న జంగాల అజయ్ కుమార్  మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చి  మూడు సంవ‌త్స‌రాలు గడుస్తున్నా గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదన్నారు. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలతో మమేకమై గ్రామ స్థాయి నుంచే ఉద్యమాలు చేపట్టాలని నాయకులకు సూచించారు. ప్రజలను సంఘటితం చేసేందుకు  నడుం బిగించాలన్నారు. గ్రామస్థాయిలో సామాజిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, గ్రామాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. స‌మావేశంలో  ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని ,వేలూరు గ్రామ కార్యదర్శి కందిమళ్ల‌ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్  బొంత తిరుపతయ్య,రైతు సంఘం  కార్యదర్శి తాళ్లూరి బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి చౌటుపల్లి నాగేశ్వరరావు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: గ్రామ స్థాయి నుంచే ఉద్యమాలు చేపట్టాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE