728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 15, 2022

చిలకలూరిపేట:మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి


చిల‌క‌లూరిపేట‌:మున్సిప‌ల్ ప‌ర్మినెంట్‌, అవుట్ సోర్పింగ్, కాంట్రాక్టు కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని సీపీఐ ఏరియా కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ‌సుబ్బాయ‌మ్మ కోరారు. ఏఐటీయూసీ అనుబంధ చిల‌క‌లూరిపేట పుర‌పాల‌క సంఘం మున్సిప‌ల్ ప‌ర్మినెంట్‌, కాంట్రాక్టు, అవుట్ సోర్పింగ్ కార్మికుల యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ డి ర‌వీంద్ర‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా నాగ‌బైరు రామ‌సుబ్బాయ‌మ్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ పర్మినెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని,  పురపాలక సంఘ అధికారులకు విన్న‌మించుకున్నా ఇంత‌వ‌ర‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌న్నారు.  గత్యంతరము లేక  రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మునిసిపల్ పర్మినెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని  విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ఏఐటీయూసీ ఏరియా కార్య‌ద‌ర్శి దాస‌రి వ‌ర‌హాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సిలో ఫిట్మెంట్ ను పెంచాల‌ని, . హెచ్ఆర్ఏ లో స్లాబుల సిస్టమ్ ఎత్తివేయాలని కోరారు. జిపియఫ్ ఖాతాలు తెరవాలని  సిపియస్ విధానం రద్దు చేసి, ఒప్పంద కాంట్రాక్ట్ పారిశుద్ధ్య ఇంజినీరింగ్ విభాగ కార్మికులను, స్కూల్ స్వీప‌ర్ల‌ను ప‌ర్మినెంట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ సుభాని మాట్లాడుతూ ప‌ర్మినెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేసి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పర్మినెంట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సెలవులు అన్నీ అమలు పరచాలని,  అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయినా వారికి ఏదైనా ఇబ్బంది జరిగినా వారి కుటుంబ సభ్యులకే ఆ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కులు బోయిన‌ప‌ల్లి యోగ‌య్య‌, జ‌య‌రావు, చెంచయ్య‌, మార్త‌మ్మ‌, జ‌గ‌దీస్‌, బండి ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట:మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE