728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 23, 2022

చిలకలూరిపేట: 28,29 వ తేదీ సార్వ‌త్రిక స‌మ్మె విజ‌య‌వంతం చేయాలి


 చిల‌క‌లూరిపేట‌: 

ఈ నెల‌28,29 తేదీన దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించ‌నున్న సార్వ‌త్రిక స‌మ్మెలో భ‌వ‌న నిర్మాణ కార్మికులు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని ఏఐటీయూసీ అనుబంధ భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంఘం నాయ‌కులు పిలుపునిచ్చారు.  బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని  సంఘ కార్యాల‌యం వ‌ద్ద సార్వ‌త్రిక స‌మ్మెను విజ‌య‌వంతం చేయాల‌ని స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ   దేశంలో ప్రతీ కార్మికునికి కనీస వేతనంగా 26వేలు నిర్ణయించి అమలుచేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ ఉక్కు, రైల్వేలను, పోస్టల్, పోర్టులను, విమాశ్రయాలను ప్రేవేటికరణ చేయడం మానుకోవాలన్నారు. . సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సంక్షేమ బోర్డు నుండైనా కనీసం నెలకు రూ.10,000 చొప్పున 6 నెలలకి ఇవ్వాలని, కార్డ్ దారులకి చనిపోయిన వారికి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వలేదని వాటిని వెంటనే క్లియర్ చేయాలని, లేబర్ అధికారులు కొత్త కార్డులు మంజూరు చేయాలని, రెన్యువల్స్ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. 

పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ నెల 28, 29 తేదీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు జ‌రుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాల‌ని కోరారు.  కార్యక్రమాల్లో పట్టణంలోని భ‌వ‌న నిర్మాణ కార్మికులు,  క కర్షక అసంఘటితరంగ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మానికి  ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్షుడు పేలూరి రామారావు అధ్య‌క్ష‌త వ‌హించ‌గా, భ‌వన నిర్మాణ కార్మిక‌సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వెంక‌ట సుబ్బ‌య్య‌, జిల్లా అధ్య‌క్షుడు కాసా రాంబాబు, చిల‌క‌లూరిపేట భ‌వ‌న నిర్మాణ కార్మిక సంఘం అధ్య‌క్షుడు తుబాటి సుభానిమేస్త్రి, నాయ‌కులు బాబావ‌లి, ఉమ‌ర్‌వ‌లి, కాసా సాంబ‌య్య‌, ఏడు కొండ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: 28,29 వ తేదీ సార్వ‌త్రిక స‌మ్మె విజ‌య‌వంతం చేయాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE