728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 24, 2022

చిలకలూరిపేటలో లైసెన్స్ లేని థియేటర్లు ఎన్నో తెలుసా... అధికారుల చర్యలేవి... నూతన సినిమా పేరుతో ప్రేక్షకుల నిలువుదోపిడి కి రంగం సిద్ధం..!

చిలకలూరిపేట పట్టణంలో పది సినిమా థియేటర్లు ఉన్నాయి. వీటిలో ఐదు థియేటర్లు ఏసీ థియేటర్లు కాగా 5 థియేటర్లు నాన్ ఏసీ థియేటర్లుగా కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లు వారు తప్పనిసరిగా బీ ఫాం లైసెన్స్ సంబంధిత జిల్లా అధికారులకు సమర్పించాలని కోరారు. ఆర్ సి నెంబర్ 766/2021-సి1, 23.12.2021 తేదీన జిల్లా కలెక్టర్ చిలకలూరిపేట పట్టణంలో ని విజయలక్ష్మి, వెంకటేశ్వర, రామకృష్ణ, కృష్ణ మహల్, శ్రీనివాస థియేటర్లకు 2012 సంవత్సరం నుండి బి ఫాం లైసెన్సు లేదని నోటీసులు సంబంధిత మండల స్థాయి అధికారులు ద్వారా జారీ చేశారు. థియేటర్ల వారు ప్రభుత్వ ఎలివేషన్ సెక్షన్ 9, 10 ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ 19 95 ప్రకారం సినిమా థియేటర్లు నిర్వహించుట లేదని వీరికి కావలసిన ఫైరు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటల్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లు తీసుకొని బీ ఫార్మ్ లైసెన్స్ పొందవలసిందిగా జిల్లా కలెక్టర్ ది 7. 1.2022 ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే చిలకలూరిపేట లోని ఐదు ఏ.సి థియేటర్లలో కేవలం కొన్నిటికి మాత్రమే బి ఫారం లైసెన్స్ ఉన్నట్లు కొన్ని థియేటర్లకు లేనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మిగతా థియేటర్లకు అసలు బి ఫాం లైసెన్సులు లేనట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ది 7.1. 2022న చిలకలూరిపేట పట్టణం లోని ఐదు నాన్ ఏసీ థియేటర్ వారు జిల్లా అధికారులకు తమకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా అర్జీ దాఖలు చేయగా సదరు జిల్లా జాయింట్ కలెక్టర్ థియేటర్ల యజమానులకు పదివేల రూపాయలు చొప్పున అపరాధ రుసుము విధించారు. ఈ పెనాల్టీ విధించిన 15 రోజుల్లో సంబంధిత థియేటర్ యజమానులు ఎన్ఓసి తీసుకొని బీ ఫార్మ్ లైసెన్స్ ను జిల్లా కార్యాలయంలో అందజేయాలని కోరారు. అయితే 25 .1.2022 తేదీ నాటికి థియేటర్ వారు అందరూ లైసెన్స్ అధికారులకు అందజేయాలి. కానీ చిలకలూరిపేటలో కేవలం రెండు, మూడు థియేటర్ లు తప్పా ఎవరు లైసెన్స్ను జిల్లా అధికారులకు సమర్పించలేదు.

తహశీల్దార్ వివరణ

ఈ విషయంపై చిలకలూరిపేట తహాసిల్దార్ను వివరణ కోరగా ఒక్క శ్రీనివాస థియేటర్ కు లైసెన్సు లేదని మిగతా థియేటర్లకు ఉందని చెబుతున్నారు. 

ఇది ఇలా ఉండగా అర్.వో. సి నెంబర్ 587/2021సి.1, దీ 26.10.21 ప్రకారం తప్పనిసరి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని చెప్పారు. జీవో నెంబర్ 13 ప్రకారం
మున్సిపాలిటీలో మల్టీప్లెక్స్ ఏసి థియేటర్లకు125 రూపాయలు టికెట్ అమ్మాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. వంద కోట్లు దాటిన అధిక బడ్జెట్ సినిమాలకు 75 రూపాయలు అదనంగా 10 రోజులు టికెట్లి విక్రయించవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం తెలిసిందే.

అయితే పైన చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తే ....చిలకలూరిపేటలో పది థియేటర్లలో సుమారు 8 సినిమా థియేటర్లకు బీ ఫార్మ్ లైసెన్సు జిల్లా అధికారులకు అందజేయలేదని విశ్వసనీయ సమాచారం. అలానే ఆన్లైన్ టికెట్ బుకింగ్ కేవలం గురువారం సాయంత్రం ఐదు గంటలకల్లా ఒక ఏసీ థియేటర్ మాత్రమే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవడం ....మిగతా థియేటర్లు ఆన్లైన్ బుకింగ్ కాకుండా కొన్ని నామమాత్రంగా ఆన్లైన్ లో పెట్టి మిగతా టికెట్లు అధిక రేట్లకు అమ్ముకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సంబంధిత అధికారులు ప్రేక్షకులను నిలువుదోపిడి చేయకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం థియేటర్లు నిర్వహించేలా చర్యలు తీసుకొని ....ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు మాత్రమే టికెట్లు అమ్ముకునే లా చర్యలు తీసుకోవాలని సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో లైసెన్స్ లేని థియేటర్లు ఎన్నో తెలుసా... అధికారుల చర్యలేవి... నూతన సినిమా పేరుతో ప్రేక్షకుల నిలువుదోపిడి కి రంగం సిద్ధం..! Rating: 5 Reviewed By: NEWS UPDATE