728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 23, 2022

చిలకలూరిపేటలోని వైన్ షాపు మార్చడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి అరవై లక్షల నష్టం... ఆ షాపు అక్కడి నుంచి తొలగించక పోతే ఆందోళన చేస్తామంటున్న కాలనీవాసులు


రాష్ట్ర ప్రభుత్వం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఆరు వైన్ షాపులను ఏర్పాటు చేసి  షాపులలో పని చేయడానికి సూపర్వైజర్ లను సేల్స్ మెల్లను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది.  అయితే చిలకలూరిపేట పట్టణంలో 6 వైన్ షాపులు ఉన్నాయి.  కృష్ణ మహల్ సెంటర్, సి ఆర్ కాలనీ రోడ్డు, మార్కెట్ సెంటర్, కె బి రోడ్డు, రైతుబజార్ ఆపోజిట్ మరియు నర్సారావుపేట సెంటర్లలో వైన్ షాపులలో మద్యం అమ్మకాలు జరుగుతుండేవి.  కాగా నరసరావుపేట సెంటర్ లోని 0733 వైన్ షాప్ ను ఎక్సైజ్ అధికారులు పట్టణంలోని చెరువు రోడ్ లో గల పొలాల్లో మార్చడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం నర్సారావుపేట సెంటర్ లోని ఒక సెల్లార్లో నిర్వహిస్తున్న 0733 వైన్ షాపు రోజుకు మూడు నుండి మూడున్నర లక్షల రూపాయల విక్రయాలు నిర్వహిస్తున్నారు.  పట్టణంలో అత్యధికంగా సేల్స్ నిర్వహించే షాప్ కూడా ఇదేనని చెప్పుకొస్తున్నారు. అయితే వైన్ షాప్ పక్కన ఒక వ్యక్తి పురపాలక సంఘ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుందని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు షాపు యజమానికి నోటీస్ ఇస్తూ పార్కింగ్ ప్లేస్కు ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోవాలని నోటీసు అందజేశారు.  దీంతో సదరు షాపు యజమాని కోర్టును ఆశ్రయించగా... అగ్రిమెంట్ ఉన్నన్నాళ్ళు షాపు నిర్వహించుకోవచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా చిలకలూరిపేట పట్టణం లోని చెరువు రోడ్ లోని  ఒక రేకుల షెడ్డు లో ఈ వైన్ షాప్ ను నాలుగు రోజుల క్రితం మార్చారు.  ప్రస్తుతం షాప్ లో 50 నుండి 90 వేల రూపాయలు మాత్రమే సేల్స్ జరుగుతుంది.  ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు కు సమీపంలో సింగు నగర్, సుగాలి కాలనీలకు ఆనుకొని వైన్ షాప్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.  ఈ విషయంపై ఆందోళన చేపడతామని సుగలి కాలనీ, సింగు నగర్ వాసులు అధికారులను  హెచ్చరిస్తున్నారు.  రోజుకు మూడు నుండి మూడున్నర లక్షల వరకు జరిగే వ్యాపారాన్ని వదిలేసి కేవలం 90 వేల లోపు జరిగే వ్యాపార ప్రాంతానికి రావడంపై ఎక్సైజ్ అధికారుల ఇంట్రెస్ట్ ఏమిటని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు.  ఏదేమైనా ఈ విషయంపై విచారణ నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి నెలకు సుమారు 60 లక్షల రూపాయలు గండికొట్టే ప్రయత్నం పై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలోని వైన్ షాపు మార్చడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి అరవై లక్షల నష్టం... ఆ షాపు అక్కడి నుంచి తొలగించక పోతే ఆందోళన చేస్తామంటున్న కాలనీవాసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE