728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 25, 2022

చిలకలూరిపేటలో కల్తీ ఆయిల్ కు ఫేమస్ ఈ కంపెనీ !....భగ్గుమంటున్న వంటనూనెల ధరలు


చిలకలూరిపేటలో నిత్యావసరాల లో ఒకటైన వంటనూనెల ధరలు భగ్గు.  గత కొద్ది రోజుల నుండి వంటలకు ఉపయోగించే పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, శనగ నూనె ధరలు ఆకాశాన్నంటాయి.  రష్యా ఉక్రెయిన్ యుద్ధ  సమయం నుండి రోజు రోజుకూ ధరలు పెరిగిపోతున్నాయి.  చిలకలూరిపేట పట్టణంలో ప్రధానంగా ముగ్గులు ఏజెన్సీ దారులు రోజుకు 20 వేల లీటర్లు వంట నూనె వివిధ కిరణా షాపులకు సరఫరా చేస్తూ ఉంటారు.  అయితే గత వారం నుండి ఆయిల్ ధరలను అమాంతంగా పెంచేశారు.  ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర 200 నుండి రెండు వందల పదిహేను రూపాయల వరకు అమ్ముతున్నారు.  పామ్ ఆయిల్ ధర 180 రూపాయల నుండి 200 వరకు విక్రయిస్తున్నారు. శనగ నూనె 230 వరకు అమ్ముతున్నారు.  అయితే ఈ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ....సివిల్ సప్లై అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ధరలను  నియంత్రణ చేయడంలో విఫలం అయ్యారని చిలకలూరిపేటలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఎంఆర్పి రేట్ లను,  చిలకలూరిపేట లోని ఒక ఆయిల్ కంపెనీ ఇతర బ్రాండ్ల  కవర్లను తీసుకొచ్చి ఎంఆర్పి లు ముద్రించి వాటిలో లోకల్ ఆయిల్ నింపి ప్యాకింగ్ చేసి  చిలకలూరిపేట లోనే కాకుండా.... గోదావరి జిల్లాలకు  భారీ ఎత్తున ఈ ఆయిల్ ను  సప్లై చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  అయితే విజిలెన్స్ అధికారులు సివిల్ సప్లై అధికారులు దాడులు కొనసాగించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే గాని విషయాలు బయటికి రావని పలువురు చెబుతున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కల్తీ ఆయిల్ కు ఫేమస్ ఈ కంపెనీ !....భగ్గుమంటున్న వంటనూనెల ధరలు Rating: 5 Reviewed By: NEWS UPDATE