728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 25, 2022

చిలకలూరపేట మండల పరిధిలో దారుణం... ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం

చిలకలూరిపేట: బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం షఫీకు 2016 సంవత్సరంలో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం కి చెందిన హుస్సేన్ బీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. పాప, బాబు. పాపకు ఐదు సంవత్సరాలు. ఆదం షఫీ బొప్పూడి లో ఉంటూ చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్ వద్ద ఉన్న చిన్న పిల్లలు తినే వస్తువుల దుకాణం లో పనిచేస్తున్నాడు. 

ఐదు సంవత్సరాల కుమార్తె చిలకలూరిపేట లోని ఓ స్కూల్లో చదువుకుంటుంది. స్కూల్ కు వెళ్లే సమయంలో చిన్నారికి తల్లి స్నానం చేసేటప్పుడు తనకి నొప్పిగా ఉంటుందని.. రాత్రిపూట నాన్న పక్కన పడుకో పెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. సరెనంటూ తల్లి ఓదార్చింది. 

ప్రతిరోజు రాత్రి సమయంలో కుమారుడు తల్లి పక్కన, కూతురు తండ్రి పక్కన పడుకుంటారు. చిన్నారి చెప్పి న విషయంతో తల్లి హుస్సేన్ భీ ఆలోచనలో పడింది. భర్త ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా..? అనే సందేహం కూడా ఆమెకు వచ్చింది. గత వారం రోజులుగా పలుమార్లు కూతురు చెప్పిన విషయాన్ని చెప్పడంతో భర్తను అనుమానించింది. 

ఆదివారం రాత్రి భోజనం చేసి నలుగురు పడుకున్నారు. అంతలోనే భర్త తను బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్ బి నిద్రపోతున్నట్లు నటిస్తూ భర్త చేసే పనులు గమనించింది. తాను నిద్ర పోతున్నానా..? లేదా..? అని సెల్ ఫోన్ లైట్ వేసి చూశాడు. నిద్ర పోతున్నానని గుర్తించి వెంటనే రంగంలోకి దిగాడు. ఐదు సంవత్సరాల కుమార్తె పక్కన పడుకుని సెల్ ఫోన్ ఆన్ చేశాడు. అందులో నీలిచిత్రాలు చూస్తూ తన ఫాంట్ కిందకు అనుకొని నిద్రపోతున్న కన్న కూతురిపై అఘాయిత్యనికి పాల్పడ్డాడు. గమనించిన భార్య హుస్సేన్ బి వెంటనే భర్త ని పట్టుకుంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన తన భర్త లాంటి దుర్మార్గులు భూమి మీద ఉండకూడదని వాపోయింది.

 వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరపేట మండల పరిధిలో దారుణం... ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం Rating: 5 Reviewed By: NEWS UPDATE