నవమాసాలు మోసి కని వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టిన తల్లిదండ్రులను నేడు అర్ధరాత్రి అపరాత్రి ఒక్ ఊరిలో వదిలివెళ్లిన కసాయి కొడుకుల సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట కు చెందిన ఇద్దరు కురు వృద్ధులను వారి కడుపున పుట్టిన కుమారుడు శుక్రవారం రాత్రి నర్సారావు పేట సమీపంలోని ఈస్సాపాలెం కాళికాదేవి దేవాలయం సమీపంలో వదిలి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న నరసరావుపేట రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి మానవతా దృక్పథంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని వృద్ధుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారిని నరసరావుపేటలోని వృద్ధాశ్రమానికి చేర్చి వీరి కుమారుడి కోసం సిబ్బందిని చిలకలూరిపేటకు పంపించినట్లు తెలిసింది....
April 23, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: తల్లిదండ్రులను గుడి వద్ద రాత్రి వదిలి వెళ్లిన చిలకలూరిపేట కు చెందిన కసాయి కొడుకు... దాతృత్వం చాటుకున్న పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE




