చిలకలూరిపేట రూరల్ : ప్రమాదవశాత్తు గ్రానైట్ ఫ్యాక్టరీలో క్రేన్ నడుపుతూ కిందపడి రాజస్థాన్కు చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన చిలకలూరిపేట మండలం మద్దిరల గ్రామం లోని గణేష్ గ్రానైట్స్ లో శనివారం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం, గుర్జార్ జిల్లా ఆంగోతు గ్రామానికి చెందిన మూల రాము (31) చిలకలూరిపేట మండలం లోని గణేష్ గ్రానైట్స్ లో ప్రాక్లైనర్ క్రేన్ డ్రైవర్ గా పని చేస్తూ గ్రానైట్ రాళ్లను తొలగించే క్రమంలో ఒక పక్క భూమి కుంగిపోవడం తో క్రేన్ ఒరిగిపోయి కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటనపై చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలియజేశారు.
చిలకలూరిపేట గ్రానైట్ ఫ్యాక్టరీ లో పనిచేసే కార్మికుడు మృతి